అమర్ అక్బర్ ఆంటోనీ రిలీజ్ ఎప్పుడు..?

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం “అమర్ అక్బర్ ఆంటోనీ” ..లాస్ట్ ఇయర్ కాస్త గ్యాప్ తీసుకొని “రాజా ది గ్రేట్” తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఈ ఇయర్ లో ఇప్పటికే రెండు చిత్రాలు విడుదల చేసిన ఆ చిత్రాలు ఆశించిన విజయం సాదించలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఎలాగైనా సరే శ్రీను వైట్ల దర్శకత్వం లో చేస్తున్న “అమర్ అక్బర్ ఆంటోనీ” తో మంచి హిట్ కొట్టి ఫాన్స్ ని హ్యాపీ చెయ్యాలి అని చూస్తున్నాడు  రవితేజ.. చాల రోజులు తరువాత తెలుగు లోకి ఇలియానా ఈ చిత్రం తో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఈ చిత్రం ఇటు రవితేజ కి ఎంత అవసరం ఓ శ్రీను వైట్ల కి కూడా అంతే అవసరం.. కాగా ..ఈ చిత్రాన్ని భారీగా ప్లాన్ చేస్తున్నాడు శ్రీను వైట్ల .. దీంతో మొదట అక్టోబర్ లో రిలీజ్ చెయ్యాలి అని ప్లాన్ చేసిన కొన్ని కారణాల తో సినిమా రిలీజ్ కాలేదు.

కానీ ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ ఫై ఒక క్లారిటీ రాలేదు.. తాజా గా నవంబర్ 16 రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. దీంట్లో ఎంత నిజం ఉందో అనేది నిర్మాతల నుంచి ఒక న్యూస్ వొస్తే కానీ తెలియదు.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.