అర్జున్ రెడ్డి తో జోడీ కట్టనున్న రాశి

0

అర్జున్ రెడ్డి మూవీ తర్వాత విజయ్ దేవరకొండకి ప్రస్తుతం క్రేజ్ మాములుగా లేదు. యువతలో విజయ్ పేరెత్తితేనే వెర్రెత్తి పోతున్నారు.  మరోవైపు అల్లు అరవింద్ లాంటి సీనియర్ నిర్మాత విజయ్ వంద సినిమాలు చేయడం ఖాయం అంటూ రీసెంట్ గా కితాబిచ్చాడు.  రేపు విజయ్ తాజా చిత్రం ‘గీత గోవిందం’ సినిమా రిలీజ్ అవుతోంది. అడ్వాన్సు బుకింగుల రచ్చ ఆల్రెడీ పీక్స్ లో ఉంది.

మరి అలాంటి హీరోతో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకొనే అవకాశం వస్తే ఏ హీరోయిన్ ఎలా వదులుకుంటుంది చెప్పండి.. ఎగిరి గంతేసి ఒప్పుకోవాలి కదా.  తాజాగా రాశి ఖన్నా కి ఈ అవకాశం వరించిందని సమాచారం.  డైరెక్టర్ క్రాంతి మాధవ్ తో విజయ్ దేవరకొండ ఒక సినిమా చెయ్యాల్సి ఉంది..ఈ రౌడీ హీరో ప్రస్తుతం ‘నోటా’.. ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో నటిస్తున్నాడు.  ఈ సినిమాల తర్వాత క్రాంతి మాధవ్ సినిమా ఉంటుంది.  ఈ ప్రాజెక్ట్ ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై KS రామారావు నిర్మిస్తారట.  అక్టోబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలవ్వబోతుందని సమాచారం.  ఆలోపు  ‘నోటా’.. ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ ను కంప్లీట్ చేస్తాడట.

విజయ్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చెయ్యబోతున్నఈ సినిమా  మంచి ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట.  రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ కథని తయారు చేసుకున్నాడట.