‘గీత గోవిందం’ 5 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా..

0

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు స్కీన్ మ్యాజిక్ వల్ల గీత గోవిందం సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ప్రముక నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాస్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించాడు.

గీత మరియు గోవిందం మద్య బస్సు లో జరిగిన ఒక చిన్న పాయింట్ చుట్టూ సున్నితమైన భావోద్వేగాల నడుమ అల్లుకున్న ఈ సినిమా కథ, కథనం ఇటు యూత్ తో పాటు అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు అర్జున్ రెడ్డి సినిమాలతో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సంపాదించుకున్న ఇమేజ్ ఈ గీత గోవిందం సినిమాకు మరింత ప్లస్ అయింది. మొత్తంగా రిలీజ్ అయి కేవలం ఐదు రోజుల్లోనే గీత గోవిందం సినిమా డబుల్ ప్రాఫిట్స్ తెచ్చింది. ఏకంగా 53కోట్ల షేర్ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. అలాగే ఇంకా అన్ని థియేటర్స్ లోనూ హౌసేఫుల్ తో కలెక్షన్స్ స్టడీగా ఉండటం విశేషం.

గీత గోవిందం ఐదు రోజుల కలెక్షన్స్:

నైజాం        : 8కోట్ల 65లక్షలు
వైజాగ్        : 2కోట్ల 23లక్షలు
ఈస్ట్           : 1కోటి 75లక్షలు
వెస్ట్            : 1కోటి 39లక్షలు
కృష్ణా          : 1కోటి 66లక్షలు
గుంటూర్    : 1కోటి 74లక్షలు
నెల్లూర్       : 0.66 లక్షలు
(ఆంధ్ర       : 9కోట్ల 40లక్షలు)
సీడెడ్         : 3కోట్ల 35లక్షలు

–నైజాం, ఏపి కలిపి టోటల్     : 21కోట్ల 50 లక్షలు షేర్–

కర్ణాటక                   : 2 కోట్ల 30లక్షలు
తమిళనాడు           : 0.60 లక్షలు

–ఇండియా మొత్తం టోటల్     : 24 కోట్ల 65లక్షలు–

(ఓవర్శీస్)

యూఎస్ఏ                          : 5 కోట్ల 95లక్షలు
ఆస్ట్రేలియా/న్యూజీలాండ్       :  0.50 లక్షలు
రెస్ట్ ఆఫ్ వరల్డ్                    : 0.55 లక్షలు

మొత్తానికి.. ఇండియా, వాల్డ్ వైడ్ గా కలిపి 31 కోట్ల 75 లక్షల షేర్ తో విజయ్ దేవరకొండ తనకంటూ ఒక బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని సృష్టిస్తున్నాడు..
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ అమ్మింది కేవలం 15కోట్లకు మాత్రమే. అయితే ఆ మార్క్ ను ఫస్ట్ డేనే గీత గోవిందం టచ్ చేసింది.. మరి ఇప్పుడు డబల్ ప్రాఫిట్స్ ను తెచ్చుకోవడమే కాకుండా… యాభై కోట్ల షేర్ వైపు పరుగులు పెడుతోంది.