‘గూఢచారి’ సినిమాకి ఒకటి కాదు రెండు సీక్వెల్స్….

0

అడవి శేష్ నటించిన ‘గూఢచారి’ గత పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అవుతున్న సినిమా. ఈ నెల 3న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని.. అనుకున్న దానికంటే అధికంగా అంచనాల్ని మించిన కలెక్షన్ల తో దూసుకెళ్తోంది. రెండో వారంలోనూ గూడచారి తన సత్తా చాటుకుంటూ రూ.10 కోట్ల షేర్ మార్కును అందుకున్నాడు. ఈ సినిమా.కేవలం రూ.6 కోట్ల స్వల్ప బడ్జెట్లో తెరకెక్కి రెట్టింపు వసూళ్లు రాబడుతుంది. ఇంత సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ తీయాలని చిత్ర బృందం భావిస్తోంది. ‘గూఢచారి’కి సీక్వెల్ ఉంటుందని విడుదలకు ముందే ప్రకటించాడు హీరో అడవి శేష్. సినిమా అంచనాల్ని మించి విజయం సాధించడంతో శేష్ అండ్ కో మరింత ఉత్సాహంగా సీక్వెల్ దిశగా అడుగులు వేస్తోంది.

అయితే అడవి శేష్ ‘గూఢచారి’కి కేవలం ఒక సీక్వెల్ కాదని.. ఇంకా రెండు భాగాలు ఉంటాయని గూడచారి  చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క ప్రకటించాడు. ఆల్రెడీ అతడు..ఈ సినిమాకి కథ రాసిన హీరో అడవి శేష్ తో ఈ సినిమాకి సంభందించిన సీక్వెల్స్ గురించి చర్చించామని.. ప్రస్తుతం మా ఆలోచలను షేర్ చేసుకుంటున్నామని ఈ చిత్ర డైరెక్టర్ తెలిపాడు. అలాగే ‘గూఢచారి’ తొలి సీక్వెల్ అతి త్వరలోనే మొదలుపెట్టడానికి ప్రయత్నిస్తామన్నాడు. మన టాలీవుడ్లో ఒక సిరీస్ లో సినిమాలు రావడం చాలా అరుదు. అలాగే మన దగ్గర సీక్వెల్స్ సినిమాలు వర్కువటైన దాఖలాలు కూడా చాలా తక్కువే అని చెప్పాలి. కానీ ఈ చిత్రానికి ఆ స్కోప్ బాగా ఉంది. అంత అనుకునట్టుగా పకడ్బందీగా తీస్తే మాత్రం కనీసం రెండు సీక్వెల్స్ వర్కువటయ్యే అవకాశాలున్నాయి అని చెప్పొచు. ఈ కథకు అంతటి డెప్త్ తో పాటుగా ఆ పరిధి కూడా ఉంది. తాజాగా రిలీజ్ అయిన గూడచారి లో హీరో ఛేదించింది కేవలం తన పర్సనల్ టాస్కే. అతడికి ఇంకా పెద్ద స్థాయి టాస్కులిచ్చి తర్వాతి భాగాల్ని ఆసక్తికరంగా నడిపించవచ్చు. అయితే ‘గూఢచారి’ పెద్ద హిట్టయిన నేపథ్యంలో సీక్వెల్స్ ని భారి బడ్జెట్ తో మరింత హై స్టాండర్డ్స్ లో తీయడానికి చాలా అవకాశముంది.