మహేశ్‌ కోసం వస్తున్న సూపర్ స్టార్?

0
Mahesh Babu AMB Cinemas

టాలీవుడ్ టాప్ హీరోస్ లో ఒకడైన సూపర్ స్టార్ మహేశ్‌బాబు మల్టీప్లెక్స్‌ బిజినెస్‌ను స్టార్ట్ చెయ్యబోతున్నాడు. ప్రస్తుత సమాచారం ప్రకారం మహేష్ బాబు తన మల్టీప్లెక్స్ బిజినెస్ ని ఇండియాలోనే ప్రముఖ  డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ అయిన ఆసియన్‌ సినిమాస్‌తో కలిసి రంగంలోకి దిగుతున్నట్లుగా తెలుస్తుంది. గచ్చిబౌలిలోని బొటానికల్‌ గార్డెన్‌ సమీపంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత మల్టీ ప్లెక్ష్ ని నిర్మించారు.

‘AMB‌ Cinemas’ గా ఈ మల్టీప్లెక్స్ కి పేరు పెట్టినట్లుగా తెలిసింది. అమీర్ ఖాన్ మరియు అమితాబ్ బచ్చన్ లు నటించిన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ సినిమా తో ఈ మల్టీప్లెక్స్ స్టార్ట్ చెయ్యాలని మొదట్లో అనుకున్నారట కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వెయ్యాల్సి వచిందని తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా తాజాగా సమాచారం ఏంటంటే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అక్షయ్ కుమార్ విలన్ గ నటించిన ‘2.O’ సినిమాతో తన మల్టీప్లెక్స్  ని స్టార్ట్ చెయ్యాలని భావిస్తున్నాడట తెలుగు సూపర్ స్టార్.

అయితే చిత్ర వర్గాల సమాచారం ప్రకారం చూస్తే ఈ మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి యూనివర్సల్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రానున్నారట. సినిమా థియేటర్‌ సంబదించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ మల్టీప్లెక్స్‌లో 7 స్క్రీన్లు ఉన్నాయని మరియు చాలా విశాలవంతమైన స్థలంలో ఈ మల్టీప్లెక్స్ ఉండనుంది అని సమాచారం.