Sitara and Aadya unveils Mahesh babu new movie logo

Sitara and Aadya unveils Mahesh babu new movie logo

కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్‌ అనే నేను’ లాంటి బిగ్గెస్ట్ హిట్‌ తరువాత మహేష్‌ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న#ssmb25 మూవీపై అందరి దృష్టి నెలకొంది. ఎందుకుంటే మహేష్‌ బాబు కెరీర్‌లో ఇది 25వ సినిమా. ఈ చిత్రం కోసం మహేష్‌ గడ్డం మరియు మీసం పెంచి ఒక సరికొత్త లుక్‌ ట్రై చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలను భారి స్థాయిలో పెంచేస్తోంది.

ఈ నెల అనగా ఆగస్టు 9న సూపర్ స్టార్  మహేష్‌ బాబు పుట్టినరోజు. ఆ రోజున ఈ ప్రతిష్టాత్మక మహేష్ 25వ సినిమా ఫస్ట్‌ లుక్‌ను అభిమానులకు కానుకగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే శనివారం సాయంత్రం మహేష్ కూతురు సితార, వంశీ పైడిపల్లి కూతురు ఆద్యలు ఈ సినిమా లోగోను రివీల్‌ చేశారు. ఈ సినిమా లో పూజా హెగ్డే కథా నాయికగా నటిస్తున్నారు.