Everything About the Rabin hood of Telangana ‘Panduga Sayanna’

Panduga Sayanna
Rabin hood of Telangana 'Panduga Sayanna'

Everything About the Rabin hood of Telangana ‘Panduga Sayanna’: ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేసి ప్రజల పక్షాన నిలబడ్డాడు, తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజల కోసం భూస్వాముల ఇళ్లపై పడి గోదా ములు పగులగొట్టి ధాన్యం బస్తాలు బైటకు తెచ్చి పంచిపెట్టాడు. మరి ఆయన ఈ పోరాటాన్ని ఎందుకు మొదలు పెట్టాడు? చివరికి ఎవరు ఆయన తల నరికి మొండెం ఒక దగ్గర, తల ఒక దగ్గర విసిరేసారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సాయన్న మహబూబ్‌ నగర్‌ జిల్లా, నవాబ్‌పేట మండలం, మెరుగోని గ్రామంలో జన్మించాడు. సాయన్న తన గ్రామంలో దసర మరియు మొహరం రెండు పండుగలు కలిసివచ్చిననాడు  జన్మించాడట. అతను “తెనుగ/ముదిరాజ్” కుటుంబంలో జన్మించాడు. కటిక పేదరికం కారణంగా అతని తల్లిదండ్రులు అతన్ని పాఠశాలకు పంపించలేకపోయారు. ఆ కారణంగా అతను కుటుంబ వృత్తిలో నిమగ్నమయ్యాడు.

సాయన్న సామిగారిడి క్రీడలో ఆరితేరినవాడు. ఆయనకు ఆరుగురు స్నేహితులు ఉండేవారట. తన స్నేహితులు అందరు కలిసి ఒక ‘గ్యాంగ్’ గా ఏర్పాటయ్యారు. “సమగరిడి”  క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ మంచి ఫిజిక్‌తో ఉండేవారట. ఆరోజుల్లో గ్రామాల్లో దొరల పాలనా ఉందేది. వాళ్ళదే అధికారం అంత వాళ్ళు చెప్పిందే చెయ్యాలి ఎవరైనా సరే.  వారి అరచాకాలకి అడ్డు అదుపు లేకుండా ఉండేది. సాయన్న కుటుంబ భూములను భూస్వాములు ఆక్రమించుకున్నారు.

Panduga Sayanna

గ్రామాల్లో దళిత ప్రజలు భూస్వాముల దగ్గర తల వంచుకొని నడిచే పరిస్థితి. వాళ్ళ అరచాకాలని ఎవరు ఎదురించే వారు కాదు. ఈ పరిస్థితులు పండుగ సాయన్న ఆగ్రహానికి గురిచేశాయి. ఎలాగైనా ప్రజాలను భూస్వాము దోపిడుల నుండి బయట పదేయ్యలన్నతపన ఆయనలో పెరిగింది. వాళ్ఎళని ఏదిరించటానికి తన స్నేహితులతో కలిసి ఒక సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

మూడు పూటలు తినడానికి తిండే లేని రోజులవి ఇక పేదల పెళ్ళిళ్లు జరగాలంటే చాలా కష్టం. సాగు చేసుకోవడానికి భూమిలేదు, కరువు కాటకాలు, కటిక పేదరికం. ఈ సమయంలో పేదల ఆకలి తీర్చటానికి పండుగసాయన్న అన్న దానాలు చేసేవాడు. సాయన్నకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి భూస్వామ్య పక్షాలు తట్టుకోలేకపోయాయి.

నిజాం పాలకులు, పటేల్స్, కరణాలు మరియు పట్వారీలు “మిలాకత్” సమయంలో అందరు ఒక చోట కలిసేవారు. ఈ మీటింగ్ మెయిన్ సారాంశం ఏంటంటే  “నిజాం ఫర్మానా” పేరుతో ప్రజల నుండి అదనపు పన్నులు ఎలా వసూలు చెయ్యాలి అని. తర్వాత “దండగా” జారీ చేయడం ప్రారంభించారు.

పేద ప్రజలను మరియు రైతుల నుండి ఎలాగైనా సొమ్ము లాక్కోవాలని నిశ్చయించుకున్నారు. సామాన్య ప్రజలు మరియు రైతులు నిస్సహాయ స్థితిలో జీవిస్తున్నారు. అదే సమయం లో సాయన్న లాంటి యువత ఈ దోపిడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యడం మొదలు పెట్టారు. దానికి పర్యవసానంగా వారిని పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.

biography of Pandaga Sayyanna

ఏదేమైనా, ఒక రోజు పాండుగోల్లా సయన్నను భూస్వాముల సహకారంతో క్యూఫియా పోలీసులు పట్టుకున్నారు. అతన్ని బంధించిన వార్త విన్న 14 గ్రామాల ప్రజలు అధికారులు, పోలీసు స్టేషన్ల చుట్టూ నిరసన చేపట్టారు. కొంతమంది పెద్దమనుషులుగా నిలబడి సాయన్నను విడుదల చేయించాలని వనపర్తి సంస్థాన మహారాణి శంకరమ్మ(1840-1912) పై ఒత్తిడి తెచ్చారు. ఆగ్రహించిన ప్రజలు జిల్లా జైలుపై దాడికి దిగి జైలును బద్దలుకొడతారు. కానీ, సాయన్న అక్కడ లేడు. కనబడ్డ పోలీసులపై ప్రజలు తిరగబడ్డారు.

వనపర్తి సంస్థాన మహారాణి శంకరమ్మ సాయన్న పక్షాన నిలబడింది. నిజాం రాజు మీర్‌ మహుమూద్‌ అలీని కలిసిం తనని విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. పండుగ సాయన్న విడుదల చేయాలంటే 10 వేల రూపాయలు ‘జమానత్‌’గా పోలీస్ లకి  కట్టాలని రాణి శంకరమ్మకు షరతు పెట్టాడు. ఆ 10 వేలు జరిమానా దేనికంటే సాయన్న భూస్వాముల దగ్గర దోచుకున్న మొత్తానికి సమానంగా. శంకరమ్మ ఆ షరతుకు అంగీ కరించింది. నిజాం సర్కార్‌ ‘‘మార్‌ మత్‌. ఛోడో’’ ‘(చంపకండి. వదలండి) అని హుకుం జారీ చేసింది.

అయితే భూస్వాములు మాత్రం ఎలాగైనా సాయన్నను చంపెయ్యాలని ఒక ప్లాన్ చేసారు. ‘‘మార్‌ మత్‌. ఛోడో’’ అని వున్న స్టే ఆర్డర్‌ను ఎస్పీ మోహితి మిన్‌ సాబ్‌, జంగన్‌లాల్‌, పట్వారి వెంకట్రావు నక్కజిత్తుల సలహాతో ‘‘మార్‌’’ వద్ద పుల్‌ స్టాప్‌ పెట్టి (మార్‌. మత్‌ ఛోడో) ‘‘చంపండి. వదలకండి’’ అనే అర్థం వచ్చేలా మార్చి పండుగ సాయన్నకు ఊరి శిక్ష విధించారు.

Rabin hood of Telangana

పండుగ సాయన్న తల నరికి మొండెం ఒక దగ్గర, తల ఒక దగ్గర విసిరేసారు. ప్రజలు ఆగ్రహంతో ఎస్పీ కార్యాలయం పైకి దండయాత్ర చేసారు. ఆ జనాగ్రహాన్ని చూసిన ఎస్పీ గుండె పోటుతో చనిపొయ్యాడు. ఈ కుట్రకి మూలమైన భూస్వాములు దావత్‌ చేసుకుంటున్న ప్రభుత్వ వసతి గృహాన్ని వేలాది మంది ప్రజలు చుట్టుముట్టి తగలపెట్టారు.

పాలమూరులో 150 ఏళ్ల క్రితం సాయన్న ను ఆధిపత్య వర్గాల వాళ్లు బందిపోటుగా చిత్రీకరించారు. ఇతరులు అతన్ని తెలంగాణ రాబిన్హుడ్ అని పిలిచారు. మరికొందరు అతన్ని విప్లవాత్మక హీరోగా పిలిచే స్థాయికి వెళ్ళారు. ఇంకా మనకి తెలియని ఎంతో మంది పండుగల సాయన్న లాంటి సాయుధ పోరాట యోధులు చరిత్ర పుటల్లో కనుమరుగైపోయ్యారు. Panduga Sayanna

Related Posts: