Victory Venkatesh Voiceover Srinivasa Kalyanam

Victory Venkatesh

Victory Venkatesh Voiceover Srinivasa Kalyanam

మొదటి సినిమా శతమానం భవతితోనే ఘన విజయం సాధించిన డైరెక్టర్ సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా కుటుంబ కథ చిత్రం శ్రీనివాస కళ్యాణం. నితిన్‌, రాశీఖన్నాలు హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ఒక మంచి పెళ్లి సందడి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కి ప్రముఖ సీనియర్‌ హీరో, విక్టరీ వెంకటేష్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తున్నారు. లై, ఛల్‌ మోహన్‌ రంగ వంటి సినిమాలతో నిరాశపరిచిన హీరో నితిన్‌.. శ్రీనివాస కళ్యాణం సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, జయసుధ, నందిత శ్వేతలు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా యూనిట్ మూవీ ని ప్రమోట్ చేసే పనిలో బిజీ గా ఉన్నారు..